కరెంట్ ఓవర్‌‌‌‌‌‌‌‌ లోడింగ్ సమస్యలపై దృష్టిపెట్టాం : సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్

కరెంట్ ఓవర్‌‌‌‌‌‌‌‌ లోడింగ్ సమస్యలపై దృష్టిపెట్టాం : సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సదరన్​ డిస్కమ్​ పరిధిలో ఉన్న కరెంట్​ ఓవర్​ లోడింగ్​ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ డిస్కమ్​ సీఎండీ జితేశ్​ వి.పాటిల్​ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సైబర్‌‌‌‌‌‌‌‌ సిటీ సర్కిల్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్​ఫార్మర్​ను ఫీడర్‌‌‌‌‌‌‌‌తో, వినియోగదారుల సర్వీసులను డీటీఆర్​ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానిస్తూ మ్యాపింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ట్రాన్స్​ఫార్మర్​ వద్ద ఏబీ స్విచ్​లు ఏర్పాటు చేయాలన్నారు. 2027 జనవరి నుంచి విద్యుత్​ శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా జరిగే వైఫల్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

300 ఆంపియర్లకు పైగా లోడ్ ఉన్న 33 కేవీ ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఓవర్‌‌‌‌‌‌‌‌లోడ్ ఫీడర్ల బైఫర్కేషన్, బ్యాక్ ఫీడింగ్ పనులను స్పీడప్​ చేయాలన్నారు. బుధవారం ఆయన చిత్రపురి సొసైటీని సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసే 33/11 కేవీ విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ ప్రతిపాదనను పరిశీలించారు. అనంతరం ప్రస్తుతం పనిచేస్తున్న లాంకో హిల్స్ 33/11 కేవీ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి, అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.